న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: వాణిజ్య సిలిండర్ ధరను కేంద్రం మళ్లీ పెంచింది. మార్కెటింగ్ కంపెనీలు రేట్లను సవరించడంతో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఆదివారం(ఫిబ్రవరి 1) నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 49 పెరిగింది. ఈ పెంపుతో ఢిల్లీలో దీని ధర రూ. 1,740.50 కి చేరుకుంది. గృహోపయోగ సిలిండర్ ధరలో మాత్రం మార్పులు లేవు.