బీజేపీ గంగాజలమట!.. పాపాలను కడిగేస్తుందట.. బీజేపీ నేత వ్యాఖ్యలు
భారతీయ జనతా పార్టీని గంగా జలంతో పోలుస్తూ ఆ పార్టీకి చెందిన అస్సాం నాయకుడు శిలాదిత్య దేవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని గంగా జలంతో పోలుస్తూ ఆ పార్టీకి చెందిన అస్సాం నాయకుడు శిలాదిత్య దేవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. అది కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను సమర్థిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. న్యూస్లాండ్రీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీలో చేరిన వారి పాపాలు ప్రక్షాళన అవుతాయని దేవ్ అన్నారు. బీజేపీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి బిశ్వశర్మ వైఖరిలో వచ్చిన మార్పును గురించి ప్రశ్నించగా పార్టీలు మారడం తమ పార్టీకి సమస్యే కాదని ఆయన చెప్పారు. బీజేపీ గంగాజలం లాంటిది.
గంగలో మీరు మునక వేస్తే అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు. బీజేపీలోకి ఎవరైనా వస్తే వారు పాప విముక్తి పొందుతారు అని దేవ్ చెప్పారు. ప్రతిపక్షం చేస్తున్న వాషింగ్ మెషీన్ ఆరోపణను ప్రస్తావిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు పార్టీ మారి ఉపశమనం పొందుతున్నారని చెప్పారు. వాణిజ్య కార్యకలాపాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ బీజేపీని వాషింగ్ మెషీన్ అంటున్నది. కాని మేము చాలా పవిత్రమైన వాళ్లము. మేము కొద్దిగా మతాభిమానులము. అందుకే మేము గంగాజలం అంటాము అని దేవ్ వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

