Indian Navy | న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడితో పాక్-భారత్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన క్రమంలో భారత నౌకాదళం తమ పోరాట పరాక్రమాన్ని ప్రదర్శించింది. నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు బహుళ యాంటీ-షిప్ ఫైరింగ్ (శత్రుదేశ నౌకలపై క్షిపణులు లేదా గన్ ఫైరింగ్ ద్వారా దాడి) విజయవంతంగా నిర్వహించింది.
దీర్ఘ శ్రేణి కచ్చితమైన దాడులకు తాము సంసిద్ధంగా ఉన్నామని నౌకా దళం నొక్కిచెప్పింది. దేశ సముద్ర ప్రయోజనాలను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా కాపాడుకోవడంలో భారత నావికా దళం యుద్ధానికి సిద్ధంగా ఉందని, భవిష్యత్తు పరిణామాలను ఎదుర్కోడానికి సంసిద్ధంగా ఉందని పేర్కొంటూ దీని వీడియోలను విడుదల చేసింది. అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు జరిపిందీ వివరాలు వెల్లడించ లేదు.