బెంగళూరు: పార్టీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న కాలేజీ విద్యార్థినికి ఒక వ్యక్తి బైక్‌పై లిఫ్ట్ ఇచ్చాడు. మారుమూల ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. (college student raped by biker) ఎమర్జెన్సీ మెసేజ్ అందుకున్న స్నేహితులు ఆమె ఉన్న చొటుకు చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల మహిళ కాలేజీలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నది. శనివారం రాత్రి కోరమంగళలో స్నేహితులతో కలిసి గెట్ టు గెదర్‌లో పాల్గొంది. ఆదివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో హెబ్బగోడిలోని ఇంటికి బయలుదేరింది.
కాగా, బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ కావాలా అని ఆ మహిళను అడిగాడు. తన అడ్రస్ చెప్పిన ఆమె అతడి బైక్ ఎక్కింది. అయితే హోసూర్ సర్వీస్ రోడ్ సమీపంలోని ఆమెను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు ఆ మహిళ మొబైల్ నుంచి ఎమర్జెన్సీ మెసేజ్, లొకేషన్ అందుకున్న స్నేహితులు ఆమె ఉన్న చోటుకు చేరుకున్నారు. ఎరుపు రంగు జాకెట్ కప్పుకుని ఉన్న ఆమెను చూశారు. అక్కడ ప్యాంటులో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించగా అతడు పారిపోయాడు.
అనంతరం స్నేహితులు ఆ మహిళను హాస్పిటల్‌కు తరలించడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన బైకర్‌ను గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.