Cold wave | దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా (Cold wave) విసురుతున్నది. ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హర్యాణా, యూపీలో చలి తీవ్రత పెరిగింది. పలుచోట్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంగళవారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
జమ్మూ కశ్మీర్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గరిష్టంగా 10 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా మైనస్ 2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో ప్రజలు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 19.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అహ్మదాబాద్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Also Read..
Air Pollution | ఢిల్లీలో మళ్లీ అధ్వాన స్థితికి చేరిన గాలి నాణ్యత.. 224గా ఏక్యూఐ లెవల్స్
Water During Meals | భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగాలా.. వద్దా.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?
KTR | రాహుల్జీ మీరు చేసింది సరైనదైతే.. మిమ్మల్ని అనుసరించిన మాకెందుకు అనుమతి లేదు..? : కేటీఆర్