బుధవారం 24 ఫిబ్రవరి 2021
National - Jan 25, 2021 , 21:44:14

క‌ల్న‌ల్ సంతోష్‌కు మ‌హావీర చ‌క్ర‌

క‌ల్న‌ల్ సంతోష్‌కు మ‌హావీర చ‌క్ర‌

న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: గ‌తేడాది ల‌డ‌ఖ్ వ‌ద్ద స‌రిహ‌ద్దుల్లో చైనా సైనికులతో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో వీర మ‌ర‌ణం పొందిన క‌ల్న‌ల్ సంతోష్‌బాబుకు కేంద్ర ప్ర‌భుత్వం మ‌హావీర చ‌క్ర అవార్డు ప్ర‌క‌టించింది. తెలంగాణ‌కు చెందిన సంతోష్ బాబు స్వ‌స్థ‌లం సూర్యాపేట‌. గ‌తేడాది జూన్ 15న గాల్వ‌న్ లోయ‌లోకి చొచ్చుకు వ‌చ్చిన చైనా సైన్యంపై బీహార్ -16 రెజిమెంట్ సైనిక బ‌ల‌గాలు తిప్పికొట్టాయి. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో క‌ల్న‌ల్ సంతోష్‌తోపాటు 20 మంది సైనికులు అమ‌రుల‌య్యారు.

ఈ నేప‌థ్యంలో రిప‌బ్లిక్ డే వేడుక‌ల సంద‌ర్భంగా సైనిక బ‌ల‌గాల‌కు ఇచ్చే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క వార్‌టైం గ్యాలంట్రీ అవార్డు మ‌హా వీర్ చ‌క్ర‌ను క‌ల్న‌ల్ సంతోష్‌బాబుకు ప్ర‌క‌టించింది. శ‌త్రువును ఎదుర్కోవ‌డంలో ధైర్య సాహ‌సాలు ప్ర‌క‌టించినందుకు ఆయ‌న‌కు ఈ అవార్డు ల‌భించింది. ఆయ‌న పూర్తిపేరు క‌ల్న‌ల్ బికుమ‌ళ్ల సంతోష్ బాబు. సుబేదార్ సంజీవ్‌కుమార్‌కు మ‌ర‌ణానంత‌రం ఇచ్చే కీర్తి చ‌క్ర అవార్డు ప్ర‌క‌టించింది. 

రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు ముందు రోజు సోమ‌వారం 119 మందికి ప‌ద్మ పుర‌స్కారాలు  ప్ర‌క‌టించిన కేంద్రం.. గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యంతోపాటు ఏడుగురిని ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం ప్ర‌క‌టించింది. జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే, అసోం మాజీ సీఎం త‌రుణ్ గొగోయ్, గుజ‌రాత్ మాజీ సీఎం కేశూభాయి ప‌టేల్‌, కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌, లోక్‌స‌భ మాజీ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌, సినీ నేప‌థ్య గాయ‌కురాలు చిత్ర‌ల‌ను ప‌ద్మ‌భూష‌ణ్‌ల‌తో గౌర‌వించింది. 

102 మంది ప‌ద్మ శ్రీ పుర‌స్కారాలు అందుకోనున్నారు. అందులో క‌ళా రంగానికి చేసిన సేవ‌ల‌కు గాను తెలంగాణ‌కు చెందిన క‌న‌క‌రాజుకు ప‌ద్మ శ్రీ‌ పురస్కారం ద‌క్కింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన అన్న‌వ‌ర‌పు రామ‌స్వామి, ఏ ప్ర‌కాశ్‌రావు, ఎన్ సుమ‌తిలు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారానికి ఎంపిక‌య్యారు. వీరికి త్వ‌ర‌లో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్ ఈ పుర‌స్కారాల‌ను ప్ర‌ధానం చేస్తారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo