Vande Bharat | భోపాల్, జూలై 27: వందే భారత్ రైలులో సరఫరా చేసిన ఆహారంలో చచ్చిన బొద్దింక దర్శనమిచ్చి ప్రయాణికుడికి షాకిచ్చింది. భోపాల్ నుంచి గ్వాలియర్‌కు వెళ్తున్న ఒక ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ అందించిన ఆహారంలో రొట్టె మధ్యలో చచ్చిన బొద్దింక కన్పించడంతోఅతడు దాన్ని ఫొటో తీసి షేర్ చేశాడు. ఈ ఆహారాన్ని ఎలా తినాలని ప్రశ్నించాడు.
దీనిపై ఐఆర్సీటీసీ స్పందిస్తూ ప్రయాణికులకు ఇబ్బందికరమైన ఇలాంటి ఘటనలు తాము కోరుకోవడం లేదని పేర్కొంది. ప్రయాణికుడి పీఎన్ఆర్ నెంబర్‌ను తమకు తెలియజేయాలని, భవిష్యత్‌లో ఇలాంటివి జరుగకుండా తగు జాగ్రత్తలు పాటిస్తామని తన ట్వీట్లో పేర్కొంది.
@IRCTCofficial found a cockroach in my food, in the vande bharat train. #Vandebharatexpress#VandeBharat #rkmp #Delhi @drmbct pic.twitter.com/Re9BkREHTl
— pundook🔫🔫 (@subodhpahalajan) July 24, 2023