కొచ్చి: జలాంతర్గాముల విధ్వంసక యుద్ధ నౌక మాహే భారత నావికా దళం అమ్ములపొదిలోకి చేరింది. దీంతో నావికా దళం సత్తా మరింత పెరిగింది. దీనిని కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించింది.
ఎనిమిది యాంటీ-సబ్‌మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్‌ను నిర్మించే ప్రాజెక్టులో మాహే మొదటిది. మిగిలిన వాటిని రానున్న సంవత్సరాల్లో నావికా దళానికి అప్పగిస్తారు. పుదుచ్చేరిలోని చరిత్రాత్మక నౌకాశ్రయ పట్టణం మాహే పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టారు.