Coca Cola Maggi | ఈ జనరేషన్ ఏంటో కానీ.. రకరకాల వెరైటీలతో వంటకాలను వండేస్తున్నారు. ఇప్పటివరకు మ్యాగీని తిన్నారు కానీ.. కొకకోలా మ్యాగీని తిన్నారా ఎప్పుడైనా. జన్మలో కూడా తిని ఉండరు కదా. ఇప్పటి వరకు యాపిల్‌తో బజ్జీలు, ఓరియో బిస్కెట్ల పకోడి, పానీపూరీ ఐస్‌క్రీమ్ లాంటి వెరైటీ వంటకాల గురించి చూసి ఉంటారు కదా. ఇప్పుడు కొకకోలా మ్యాగీ వంతు వచ్చేసింది.
సాధారణంగా మ్యాగీని నీళ్లతో చేస్తారు. కానీ.. ఈ మ్యాగీ స్పెషాలిటీ ఏంటంటే.. దీన్ని కొకకోలాతో చేస్తారు. ఇది ఘజియాబాద్‌లో సాగర్ పిజ్జా పాయింట్ హోటల్లో దొరుకుతుంది. దీన్ని అక్కడి స్థానికులు లొట్టలేసుకుంటూ తింటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.