పాట్నా: అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ బీహార్‌లో పెను విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. ఆర్మీ అభ్యర్థులు భారీ స్థాయిలో రైల్వే ఆస్తిని నష్టపరిచారు. అయితే అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో ప్రస్తుతం తామంతా అలర్ట్‌గా ఉన్నామని పాట్నా డివిజినల్ మేనేజర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. వీడియో ఫూటేజ్ ద్వారా దాడులకు దిగిన అభ్యర్థుల్ని గుర్తిస్తున్నట్లు ఆయన చెప్పారు. బీహార్ హింసలో సుమారు 7 లేదా 8 కోచింగ్ సెంటర్ల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నామన్నారు. అరెస్టు అయిన వారి వాట్సాప్ మెసేజ్‌లను పరిశీలిస్తే వారికి కోచింగ్ సెంటర్లతో లింకు ఉన్నట్లు తేలిందని చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఆ మెసేజ్‌లో విద్యార్థుల్ని రెచ్చగొట్టేవిధంగా ఉన్నట్లు తేల్చారు.
హింస కేసులో అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తున్నామని, దోషుల్ని గుర్తించేందుకు కోచింగ్ సెంటర్లపై తనిఖీలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థుల మొబైల్లో కొన్ని సెంటర్ వీడియోలు ఉన్నాయని, వాటిని వాట్సాప్‌లో పోస్టు చేశారు. కోచింగ్ సెంటర్ల పాత్రపై విచారణ చేపడుతున్నామని, కోచింగ్ సెంటర్లపై కేసులు వేస్తున్నట్లు జిల్లా పోలీసులు తెలిపారు.