CNG | స్వల్పంగా తగ్గిన సీఎన్జీ ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ (CNG) ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో సీఎన్జీపై రూ.4 తగ్గిస్తూ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్జీ (CNG) ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో సీఎన్జీపై రూ.4 తగ్గిస్తూ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. దీంతో ఢిల్లీలో రూ.77.20గా ఉన్న కిలో సీఎన్జీ ధర రూ.73.59కి తగ్గింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో కూడా ఇదే ధరలు అమల్లో ఉండనున్నాయి. ఇక గురుగ్రామ్‌లో రూ.82.62గా ఉన్నది. గతేడాది డిసెంబర్ 17న ఢిల్లీలో సీఎన్జీ ధరలు పెరిగాయి. అప్పటి నుంచి ధరల్లో తగ్గుదల రావడం ఇదే మొదటిసారి. సీఎన్జీ ధరలు 2021-2022 డిసెంబర్ మధ్య 83 శాతం పెరిగాయి. 2021, ఏప్రిల్ నుంచి కిలో సీఎన్జీ ధర రూ.36.16గా ఉన్నది. కాగా, దేశ రాజధానిలో సీఎన్జీ ధరలు తగ్గిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ధరల్లో మార్పులు చేర్పులు రానున్నాయి.
సీఎన్జీతోపాటు గృహావసరాలకు వినియోగించే పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) ధరను కూడా ఐజీఎల్ తగ్గించింది. ఢిల్లీలో ఇప్పటివరకు కిలో పీఎన్జీకి రూ.53.59గా ఉన్న ధర రూ.48.59కి దిగివచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

