సీఎన్జీపై కూడా బాదుడు.. కిలోకు రూ.2.5 పెంపు
CNG price | దేశంలో పెట్రో ధరలపాటే సీఎన్జీ ధరలు (CNG price) కూడా పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో కిలోకు రూ.2.5 పెరిగింది. దీంతో సీఎన్జీ ధర కిలోకు రూ.66.61కి చేరింది.
న్యూఢిల్లీ: దేశంలో పెట్రో ధరలపాటే సీఎన్జీ ధరలు (CNG price) కూడా పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో కిలోకు రూ.2.5 పెరిగింది. దీంతో సీఎన్జీ ధర కిలోకు రూ.66.61కి చేరింది. గత ఐదు రోజులుగా సీఎన్జీ ధర కిలోకు రూ.6.6 పెరిగింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ నగరాల్లో సీఎన్జీ కిలో ధర రూ.69.18 అయింది. గురుగ్రామ్‌లో రూ.74.94కు చేరింది. క్రమం తప్పకుండా ధరలు పెరుగుతుండటంతో క్యాబ్‌లలో ఏసీలను బంద్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఒక పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీటర్ పెట్రోల్‌పై మరో 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు వడ్డించాయి. దీంతో హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోలు రూ.118.59, డీజిల్ రూ.104.62గా ఉన్న ధరలు రూ.119.49కి, డీజిల్ రూ.105.49కి చేరాయి.
ఇక న్యూఢిల్లీలో లీటరుకు 80 పైసల చొప్పన పెరగడంతో పెట్రోల్ రూ.105.41, డీజిల్ రూ.96.67కు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌పై 84 పైసలు పెరగడంతో రూ.120.51కి, డీజిల్‌పై 85 పైసలు వడ్డించడంతో రూ.104.77కు చేరాయి. చమురు ధరలు పెరగడం గత 16 రోజుల్లో ఇది 14వ సారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

