Congress | ముంబై, మార్చి14 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ మహారాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు నానా పటోలే అధికార కూటమి నేతలకు వల విసిరారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు కాంగ్రెస్కు మద్దతిస్తే, ఆ ఇద్దరికీ కొంత కాలం ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల ప్రధాని మోదీలా అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. మహాయుతి పార్టీల్లో షిండే, పవార్ పరిస్థితి దయనీయంగా ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో శివసేన మనుగడకు భరోసా లేదన్నారు. బీజేపీ చిన్న పార్టీలను బతకనివ్వదని, గతంలో షిండే అమలు చేసిన పథకాలన్నిటినీ ఆపేస్తున్నారని ఆరోపించారు.