న్యూఢిల్లీ: ‘ఇండియా కూటమి’ లోపాలపై సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ‘ఇండియా కూటమి’ అంపశయ్యపై (లైఫ్ సపోర్ట్)పై ఉందని అన్నారు. శనివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, నితీశ్‌కుమార్ బీహార్‌లో ఎన్డీయే చేతుల్లోకి వెళ్లడానికి తామే కారణమని అన్నారు.
బీహార్‌లో మొత్తం విపక్షం బలహీనపడిందని అన్నారు. రేపటి నాడు జార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం) కూడా కూటమి నుండి బయటకు వెళ్లే పరిస్థితులు రావొచ్చునని హెచ్చరించారు.