శ్రీనగర్: జమ్ముకశ్మీరు సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం నక్ష్బంద్ సాహిబ్ శ్మశానం గేట్లు దూకి, లోపలికి ప్రవేశించారు. 1931లో డోగ్రా సైన్యం చేతిలో మరణించిన 22 మందికి నివాళులర్పించారు. ఇక్కడ ఏటా జూలై 13న అమరవీరుల దినం పాటిస్తారు. ఎల్జీ మనోజ్ సిన్హా 2020 నుంచి జూలై 13ను సెలవు దినాల జాబితా నుంచి తొలగించారు.
అయినప్పటికీ, ఒమర్ అబ్దుల్లా, ఆయన నేతృత్వంలోని పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆదివారం అమరవీరులకు నివాళులర్పించడం కోసం ప్రయత్నించారు. దీనిని నిరోధించేందుకు పోలీసులు వీరిని గృహ నిర్బంధంలో ఉంచారు.