ఆర్జేడీ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి సీఎం నితీశ్ కుమార్ హాజరయ్యారు. ఇప్పుడు రాజకీయంగా ఇదో పెద్ద వార్త అయి కూర్చుంది. బిహార్‌లో రాజకీయ పరిస్థితి మారిపోతోందని, జేడీయూ, ఆర్జేడీ మళ్లీ దగ్గరవుతున్నాయన్న ప్రచారం తెగ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్ స్పందించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఇఫ్తార్ విందుకు వెళ్లడం వెనుక, ఎలాంటి రాజకీయం లేదని ప్రకటించారు.
అలాగే రాజకీయ సమీకరణలు కూడా ఎలాంటి మార్పులకు లోనయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి ఇఫ్తార్ పార్టీలకు చాలా మంది నన్ను పిలుస్తుంటారు. ఈ పిలుపుకు, రాజకీయాలకు సంబంధం ఏంది? మేము కూడా ఇఫ్తార్ విందులు నిర్వహిస్తాం. అందర్నీ ఆహ్వానిస్తాం. అందులో రాజకీయం ఏమీ వుండదు అంటూ నితీశ్ పేర్కొన్నారు.
@NitishKumar ने आज @yadavtejashwi के आयोजित इफ़्तार में भाग लेने के बाद सफ़ाई कुछ इस तर्क से दी @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/ErmbULJA4I
— manish (@manishndtv) April 23, 2022
దాదాపు ఐదేళ్ల తర్వాత ఆర్జేడీ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు సీఎం నితీశ్ వెళ్లారు. గతంలో బిహార్ గ్రాండ్ అలయన్స్‌లో భాగంగా వున్న సమయంలో ఆయన హాజరయ్యారు. 2017 తర్వాత నితీశ్ బీజేపీతో పొత్తులోకి వెళ్లారు. అప్పటి నుంచి ఇఫ్తార్ విందులకు వెళ్లలేదు. సీఎం నితీశ్ హాజరుపై ఆర్జేడీ తేజస్వీ యాదవ్‌ను అడగ్గా… ఇది ఇఫ్తార్ విందు అని, అందరూ హాజరు కావొచ్చని చెప్పుకొచ్చారు.