తాను పూర్తి ఆరోగ్యంతోనే వున్నానని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. కొన్ని రోజులుగా తన ఆరోగ్యంపై లేనిపోని పుకార్లు వస్తున్నాయని, వాటిని ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఎన్నికలు ఉన్నప్పుడల్లా నా ఆరోగ్యంపై పుకార్లు వస్తాయి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. సంతోషంగా కూడా ఉన్నా. నా ఆరోగ్యంపై పుకార్లు వచ్చినప్పుడల్లా బీజేడీ గెలిచి తీరుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను’ అంటూ సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. కోవిడ్ ఇంకా సమసిపోలేదని, ప్రజలందరూ అప్రమత్తంగానే ఉండాలని ఆయన సూచించారు. మాస్కులు ధరించాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై పుకార్లు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఇలాంటి పుకార్లే వచ్చాయి. జనవరి 26 కంటే కొద్ది రోజుల ముందు కూడా ఈయన ఆరోగ్యంపై పుకార్లు వచ్చాయి. అయితే గణతంత్ర దినోత్సవాలకు సీఎం పట్నాయక్ హాజరయ్యారు.