BRS | గులాబీ మయమైన నాందేడ్.. శిక్షణ శిబిరాలకు తరలివచ్చిన మరాఠా నాయకులు
జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ (BRS).. తెలంగాణ (Telangana) వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్‌లో (Nanded) రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంతి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) మరికాసేపట్లో ప్రారంభించనున్నారు.
BRS | జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ (BRS).. తెలంగాణ (Telangana) వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్‌లో (Nanded) రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంతి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పార్టీ నాయకులు పూర్తిచేశారు. శిబిరం నిర్వహించే అనంత్‌లాన్స్ వేదిక మొత్తం గులాబీ మయమైంది. నాందేడ్ వ్యాప్తంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, దేశ్ కీ నేత కైసే హో కేసీఆర్ జైసే హో.. దేశ్ కీ నేత కేసీఆర్ వంటి నినాదాలతో ఫ్లెక్సీలు ఆకర్షిస్తున్నాయి. నాందేడ్ విమానాశ్రయం నుంచి అనంత్‌లాన్స్ మార్గంతోపాటు రైల్వేస్టేషన్ సహా ప్రధాన కూడళ్లలో గులాబీ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి. వేదికపై రాజ్యంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతీబాపూలే, ఛత్రపతి శివాజీతోపాటు మరాఠ నాయకుల ఫొటోలను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు శిక్షణా శిబిరాలకు తరలివచ్చారు. రాష్ట్రంలోని ఆరు డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకులతోపాటు ప్రతీ నియోజకవర్గం నుంచి కన్వీనర్, సమన్వయకర్త, మహిళా విభాగం కన్వీనర్, రైతు విభాగం కన్వీనర్, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఇతర ముఖ్య నాయకులు ఈ శిబిరాలకు తరలివచ్చారు. పాసులు ఉన్నవారినే శిబిరంలోకి అనుమతిస్తున్నారు. దీంతో పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాసులు తీసుకున్నారు.

ప్రచార సామగ్రితోపాటు ల్యాప్‌ట్యాప్, ట్యాబ్రెండు రోజుల శిక్షణ అనంతరం నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి.. కరపత్రాలు, గులాబీ కండువాలు, టోపీలు, వాల్‌పోస్టర్లను పార్టీ బాధ్యులకు అందజేయనున్నారు. వీటితోపాటు నెలరోజులపాటు చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలను కూడా నియోజకవర్గాలవారీగా పంపిణీ చేయనున్నారు. మహారాష్ట్ర స్థానిక కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కృతిక బాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేయనున్నారు.



Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ananth Lawns
- BRS
- CM KCR
- Maharashtra
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

