పండరీపూర్: మహారాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శ్రీవిఠల్ రుక్మిణీ ఆలయ సందర్శన సందర్భంగా శ్రీవిఠలేశ్వర స్వామికి, రుక్మిణీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ మెడలో తులసి మాల వేసి వేదమంత్రాలతో ఆశీర్వాదం అందజేశారు.
అంతకుముందు కేసీఆర్ ఆలయానికి చేరుకోగానే ప్రధాన ద్వారం దగ్గర ఆయనకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత కాషాయ వస్త్రం కప్పి సత్కరించారు. అనంతరం శ్రీవిఠలేశ్వర స్వామి, రుక్మిణీ అమ్మవార్లతో కూడిన ప్రతిమను, అదేవిధంగా రుక్మిణీ అమ్మవారి చిత్రపటాన్ని సీఎం కేసీఆర్కు బహూకరించారు. ఆ తర్వాత సీఎం అక్కడి నుంచి సర్కోలీ గ్రామానికి బయలుదేరారు.
ఆలయ ప్రధాన ద్వారం దగ్గర సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం
రుక్మిణీ అమ్మవారి సమక్షంలో తులసిమాలలో సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్కు శాలువా కప్పి సత్కరిస్తున్న ఆలయ నిర్వాహకులు
సీఎం కేసీఆర్కు విఠలేశ్వర స్వామి, రుక్మిణీ అమ్మవార్ల ప్రతిమ బహూకరణ
సీఎం కేసీఆర్కు రుక్మిణీ అమ్మవారి చిత్రపటం బహూకరణ