Manik Kadam | దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ను (BRS) స్థాపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఈ నెల 6న మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మాణిక్ కదమ్‌ను (Manik Kadam) పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. ఈమేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్ చడూనీని నియమించిన విషయం తెలిసిందే. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతున్నది.
కాగా, మహారాష్ట్రలోని ముంబైలో కల్వకుంట్ల కవిత శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని చెప్పారు. ఇక్కడి ప్రజల కోసం తాము పనిచేస్తామని ప్రకటించారు.