పంజాబ్ : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నిమిత్తం పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ హెలికాప్టర్‌కు పీఎం భద్రతా సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం చన్నీ హోషీయాపూర్కు ఇవాళ వెళ్లాల్సి ఉంది. కానీ మోదీ జలంధర్‌లో ఎన్నికల ర్యాలీలో పర్యటిస్తున్న సందర్భంగా చండీఘర్‌లోని రాజేంద్ర పార్కు ఏరియాను నో ఫ్లై జోన్‌గా ప్రకటించామని పీఎం భద్రతా సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం హెలికాప్టర్‌కు అనుమతివ్వలేదని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు హోషియాపూర్‌కు రాహుల్ గాంధీ హెలికాప్టర్లో వచ్చారు. రాహుల్ హెలికాప్టర్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ అంశంపై కాంగ్రెస్ నాయకుడు సునీల్ జఖర్ స్పందించారు. హోషియాపూర్‌కు బయల్దేరేందుకు సిద్ధమైన సీఎం చన్నీ హెలికాప్టర్‌కు పీఎం భద్రతా సిబ్బంది అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. సీఎం పర్యటనను అడ్డుకోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు.