Government Schools | లక్నో: బీజేపీ పాలిత యూపీలో దాదాపు 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమైంది. 50 కన్నా తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయించింది. విద్యా శాఖ డైరెక్టర్ జనరల్ కంచన్ వర్మ గత నెల 23న బ్లాక్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ల సమావేశంలో మాట్లాడుతూ, పనితీరు సక్రమంగా లేని బడులను గుర్తించాలని ఆదేశించారు. తక్కువ మంది విద్యార్థులున్న బడులను సమీపంలోని ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో విలీనం చేయాలన్నారు. 50 మంది కన్నా తక్కువ మంది విద్యార్థులున్న బడులు 27,764 ఉన్నాయి.
ఇరాన్ వర్సిటీలో దుస్తులు విప్పి నిరసన ; హిజాబ్‌కు వ్యతిరేకంగా విద్యార్థిని ఆందోళన!
టెహ్రాన్ : ఇరాన్లో డ్రెస్ కోడ్ (హిజాబ్)కు వ్యతిరేకంగా ఓ యువతి యూనివర్సిటీలో దుస్తులు విప్పి నిరసనకు దిగింది. ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీకు చెందిన ఓ విద్యార్థిని శనివారం వర్సిటీ వద్ద తన దుస్తులు విప్పి, లోదుస్తులతో నిరసనకు దిగటం సంచలనం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారమయ్యాయి. హిజాబ్ ధరించలేదని పోలీసులు కొట్టడం వల్లే ఆమె ఈ విధంగా నిరసనకు దిగిందని వార్తలు వెలువడ్డాయి. ఇరాన్ పోలీసులు ఆమెను కొట్టారని వార్తలు వెలువడ్డాయి. ఆమె అరెస్టును ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. ఆమెను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఆమె తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నారని ఇరాన్ హక్కుల గ్రూపులు ఆందోళన వ్యక్తం చేశాయి.