న్యూఢిల్లీ, మే 28: ప్రయాణికులకు భోజనం వడ్డించే ప్లేట్లు, ఇతర పాత్రలను దురంతో ఎక్స్‌ప్రెస్ కేటరింగ్ సిబ్బంది రైలు మూత్రశాల (టాయిలెట్)లో శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇం డియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) గురువారం రైల్వే ఐఆర్‌సీటీసికి గురువారం నోటీసులు జారీ చేసింది.
ఐఆర్సీటీసీ చర్య పరిశుభ్రత, పారిశుద్ధ్య నియామకాలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంది. 12223 దురంతో ఎక్స్‌ప్రెస్ మొ దటి తరగతి ఏసీ కోచ్‌లో మధ్యాహ్న భోజనం సర్వ్ చేసే ముందు భోజన ప్లేట్లు, ఇతర పాత్రలను టాయిలెట్ సీటుపై ఉంచి శుభ్రం చేశారు. దీనిని వీడియో తీసిన ఒక యూజర్ దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ.. చర్యలు తీ సుకోవాలని ఐఆర్సీటీసీకి నోటీస్ పంపింది.