న్యూఢిల్లీ : 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి రాష్ట్ర సీఎం నరేంద్ర మోదీతో సహా 63 మందికి సిట్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టేసింది.
పథకం ప్రకారమే గోద్రా అల్లర్లు చోటుచేసుకున్నాయనే ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. కాంగ్రెస్ నేత ఇషాన్ జాఫ్రి భార్య జకియా ఈ పిటిషన్ వేశారు. 2002లో చోటుచేసుకున్న అల్లర్ల వెనుక కుట్ర ఉందనేది ఆమె ఆరోపణ.