Uttarakhand: 12వ తరగతిలో టాపర్.. సూసైడ్ చేసుకున్న విద్యార్థిని
Uttarakhand: డెహ్రాడూన్‌కు చెందిన 23 ఏళ్ల రియా కుమారి ఆత్మహత్య చేసుకున్నది. 23 ఏళ్ల ఆ అమ్మాయి నీట్ రీఎగ్జామ్ కోసం ప్రిపేరవుతున్నది. ఐ లవ్ యూ అంటూ తన పేరెంట్స్‌కు ఆమె సూసైడ్ నోట్ రాసింది.12వ తరగతిలో ఆమె 97 శాతం మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచింది.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని డెహ్రాడూన్‌కు చెందిన 23 ఏళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది. ఐ లవ్ యూ అంటూ ఆమె తన పేరెంట్స్‌కు సూసైడ్ లేఖ రాసింది. ఆ అమ్మాయి వయసు 23 ఏళ్లు. ఆమె పేరు రియా కుమారి తప్ప. 1999 కార్గిల్ యుద్ధ వీరుడి కుమార్తె ఆమె. అయితే మంగళవారం ఉదయం ఆమె తన రూమ్ డోర్ తీయలేదు. లంచ్‌కు పిలిచేందుకు తల్లి రూమ్‌కు వెళ్లింది. ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో తండ్రికి ఈ విషయాన్ని చెప్పింది. బలవంతంగా డోర్ ఓపెన్ చేయడంతో.. ఆ విద్యార్థిని ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఆమె రూమ్ నుంచి పోలీసులు సూసైడ్ నోట్ రికవరీ చేశారు. ఐ లవ్ యూ, మమ్మీ, పాపా.. ఎవరి తప్పు లేదు అంటూ ఆమె హిందీలో ఓ నోట్ రాసింది. అయితే రాత్రంతా చదువుకునే ఆమె.. మరుసటి రోజు ఆలస్యంగా నిద్రలేచేదని పోలీసు అధికారి అంకిత్ ఖండారి తెలిపారు. తన సూసైడ్ నోట్లో తండ్రిపై ఆమె ప్రేమను వ్యక్తం చేసింది. తన చావుకు ఎవరూ కారణం కాదు అని ఆమె చెప్పింది. తన అసమర్ధత వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ నోట్లో రాసిందామె.
చదువుల్లో విజయం సాధించకపోవడం వల్లే మానసిక ఆందోళనకు గురైనట్లు పోలీసు అధికారి తెలిపారు. 12వ తరగతిలో ఆమె 97 శాతం మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచిందన్నారు. అయితే జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ కోసం ఆమె ప్రిపేరవుతున్నది. తన తొలి ప్రయత్నంలో ఆమె ఆ పరీక్షలో సక్సెస్ కాలేదని తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

