పాట్నా: పోలీస్ కస్టడీలో ఉన్న మద్యం స్మగ్లర్ను విడిపించేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. (Villagers Storm Police Station) పోలీసులతో ఘర్షణపడ్డారు. ఈ దాడిలో నలుగురు పోలీసులతో సహా 12 మంది గాయపడ్డారు. బీహార్లోని కతిహార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాయ్పూర్ గ్రామానికి చెందిన మద్యం స్మగ్లర్ సూరజ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ధన్ఖోరా పోలీస్ స్టేషన్కు అతడ్ని తరలించారు.
కాగా, పోలీస్ కస్టడీలో ఉన్న మద్యం స్మగ్లర్ సూరజ్ కుమార్ను విడిపించేందుకు గ్రామస్తులు ప్రయత్నించారు. శనివారం సుమారు వంద మంది పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. అతడ్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, గ్రామస్తుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో నలుగురు పోలీసులతో సహా 12 మంది గాయపడ్డారు.
మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నదని జిల్లా ఎస్పీ తెలిపారు. మద్యం వ్యాపారి సూరజ్ కుమార్ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడని చెప్పారు. అతడ్ని విడిపించేందుకు పోలీసులతో ఘర్షణకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేస్తామని అన్నారు. మద్యం నిషేధాన్ని పక్కగా అమలు చేస్తామని వెల్లడించారు.
बिहार के कटिहार जिले के डण्डखोरा थाना क्षेत्र में शराब माफियाओं ने पुलिस पर हमला कर दिया, जिसमें थाना प्रभारी समेत कई पुलिसकर्मी घायल हो गए। शराब तस्करी के आरोप में गिरफ्तार सूरज कुमार को छुड़ाने के लिए परिजनों और ग्रामीणों ने थाने पर धावा बोला। #Bihar pic.twitter.com/587Qnhko6o
— NBT Bihar (@NBTBihar) April 26, 2025