న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దిగువ కోర్టుల్లోనూ వర్చువల్ పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారించేందుకు సుప్రీంకోర్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు. ఇందుకు సొంతంగా క్లౌడ్ సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
సాంకేతికతో కూడిన హైబ్రిడ్ విచారణను జిల్లా స్థాయికి సైతం విస్తరించాలంటూ సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే చేసిన సూచనపై సీజేఐ స్పందించారు. మార్చి 23, 2020 నుంచి అక్టోబర్ 31, 2022 వరకు కేవలం సుప్రీం కోర్టులోనే 3.37 లక్షల కేసులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారించినట్టు ఆయన చెప్పారు.