న్యూఢిల్లీ : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ గవాయ్ బుధవారం చెప్పారు. జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పని చేసిన కాలంలో ఆయన ఇంట్లో సగం కాలిన నోట్ల కట్టల ఉదంతంపై ఇన్‌హౌస్ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.
ఈ కమిటీ సిఫారసు మేరకు వర్మను అభిశంసించాలని సీజేఐ సిఫారసు చేశారు. ఈ కమిటీ నివేదికను జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు ఈ పిటిషన్ రాగా, గవాయ్ స్పందిస్తూ అప్పటి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాతో చర్చల్లో తాను కూడా పాల్గొన్నానని అందువల్ల ఈ పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకోవడంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.