న్యూఢిల్లీ: న్యాయం కోరే చిట్టచివరి వరుసలో ఉన్న వ్యక్తికి సైతం చేరువ కావడం మన ప్రాథమిక కర్తవ్యమని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. చట్ట సభలు, కార్యనిర్వాహక శాఖ, న్యాయ వ్యవస్థ.. ఇవన్నీ ఆ వ్యక్తికి చేరువ కావాలన్నారు. అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలో మల్టీ లెవెల్ పార్కింగ్, అడ్వకేట్ చాంబర్స్ను శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
“రాజ్యాంగాన్ని రచించి, తుది ముసాయిదాను రాజ్యాంగ సభకు సమర్పించినపుడు, కొందరు ఇది అతి సమాఖ్యతత్వంతో కూడినదని, మరికొందరు అతి ఏక ధృవ వైఖరితో ఉందని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ బదులిస్తూ, ‘ఈ రాజ్యాంగం పూర్తిగా సమాఖ్యతత్వంతో కూడినది కాదు, ఏక ధృవ వైఖరి కలిగినది కాదు’ అని అన్నారు.