ఇంఫాల్: మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత రాజుకుంటున్నది. సోమవారం జరిగిన భారీ ఎన్కౌంటర్ అనంతరం ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు అదృశ్యమైనట్టు ఐజీపీ ఐకే ముయివా తెలిపారు. ఎన్కౌంటర్లో మరణించిన మిలిటెంట్లు ముసుగులతో కూడిన దుస్తులు ధరించారని, వారి వద్ద ఆధునిక ఆయుధాలు ఉన్నట్టు తెలిపారు.
ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలో నిషేధ ఉత్తర్వులు అమలు చేస్తున్నామన్నారు. కాగా, భద్రతా దళాల కాల్పులను నిరసిస్తూ కుకీ ప్రాబల్యమున్న కొండ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి బంద్ పాటిస్తున్నారు.