శ్రీనగర్: జమ్ముకశ్మీరులో మళ్లీ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ సమీపంలో గురువారం సైనిక వాహనంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పోర్టర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
ముష్కరులు పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్‌కు చెందిన సభ్యులుగా భావిస్తున్నారు. ఆర్మీ వెహికిల్ బోట్పర్తి సమీపానికి చేరుకోగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు సైనిక అధికారులు తెలిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపినట్టు వెల్లడించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు, ఓ డాక్టర్ మరణించారు.