CIVILS | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : ఈ ఏడాది నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తు గడువును యూపీఎస్సీ (యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 21 సాయంత్రం 6 గంటల వరకు గడువు పొడిగించినట్టు యూపీఎస్సీ వెబ్సైట్ తాజాగా పేర్కొన్నది.
ఈ నెల 22 నుంచి 28 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో తప్పొప్పులను దిద్దుకోవచ్చునని తెలిపింది. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు మే 25న నిర్వహిస్తున్నారు. తొలుత దరఖాస్తు గడువు ఫిబ్రవరి 11 కాగా, ఈ నెల 18కు గడువు మార్చారు. తాజాగా మరోసారి గడువు పొడిగించారు.