న్యూఢిల్లీ, జూన్ 15: సివిల్ సర్వీసెస్-2026 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 13,343 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించినట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం ప్రకటించింది. ఫలితాలను తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ 19 నుంచి 28 వరకు నిర్వహించే రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.
షెడ్యూ ల్ ప్రకారం, మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 21 నుంచి మొదలుకాబోతున్నాయి. మెయిన్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యూపీఎస్సీ త్వరలో విడుదల చేయనున్నది. ప్రిలిమ్స్ పరీక్షను దేశవ్యాప్తంగా మే 24న నిర్వహించింది.