Cigarette Prices | న్యూఢిల్లీ : ధూమపాన ప్రియులకు చేదువార్త. త్వరలో సిగరెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. పన్ను ఆదాయం తగ్గకుండా చూడటానికి కేంద్రం సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని పెంచాలని యోచిస్తున్నది. ప్రస్తుతం జీఎస్టీ 28 శాతం, ఇతర చార్జీలతో కలిపి వీటిపై 52 శాతం పన్నులు విధిస్తున్నారు. త్వరలో జీఎస్టీని 40 శాతం చేయడంతో పాటు ఎక్సైజ్ డ్యూటీని ప్రత్యేకంగా విధించాలని కేంద్రం భావిస్తున్నది.
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విధించే పరిహార సెస్ గడువు 2026 మార్చితో ముగుస్తున్నది. ఒక వేళ అది లేకపోయినా పన్ను ఆదాయం తగ్గకుండా ముందుగానే జీఎస్టీని పెంచుతున్నారు. సాధారణంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి వాటిని ‘పాపపు వస్తువులు’ క్యాటగిరీలో చేర్చారు. దీంతో వీటిపై ప్రాథమిక ఎక్సైజ్ డ్యూటీ, జాతీయ విపత్తుల కంటింజెంట్ డ్యూటీలను కూడా విధిస్తారు.