బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్పకు సీఐడీ బుధవారం నోటీసులిచ్చింది. 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు ఆయనపై మార్చిలో కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు.
బీజేపీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, యెడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఐడీ దర్యాప్తునకు హాజరవుతారని తెలుస్తున్నది.