ముంబై : సీఐడీ షోతో పేరొందిన నటుడు దినేష్ ఫడ్నిస్ (Dinesh Phadnis) మరణించారు. దినేష్ (57) మృతిని సీఐడీలో ఆయన సహ నటుడు దయానంద్ శెట్టి ధ్రువీకరించారు. దినేష్ ఫడ్నిస్ గత కొద్దిరోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతూ వెంటిలేటర్‌పై ఉన్నారు.
ముంబైలోని తుంగ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. కీలక అవయవాలు పనిచేయకపోవడంతో దినేష్ కన్నుమూశారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
సీఐడీ షోలో ఫ్రెడెరిక్స్ పాత్రలో దినేష్ గుర్తింపు పొందారు. దాదాపు రెండు దశాబ్ధాల పాటు ఈ షోతో దినేష్ ప్రేక్షకులను అలరించారు. 1998 నుంచి ప్రసారమవుతున్న సీఐడీ భారత్‌లో అత్యధిక కాలం ప్రసారమైన టీవీ సిరీస్‌గా గుర్తింపు పొందింది. సీఐడీతో పాటు ప్రముఖ టీవీ షో తారక్ మెహతా కా ఉల్టా చష్మాలోనూ దినేష్ క్యామియోగా అలరించారు.
Read More :
Chennai Airport | కాస్త శాంతించిన వరుణుడు.. చెన్నైలో విమాన సర్వీసులు పునరుద్ధరణ