పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్-ప్రశాంత్ కిశోర్ చేతులు కలపనున్నారా? రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదని చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) వర్గాలు మంగళవారం ఎన్డీటీవీకి వెల్లడించాయి. జన్ సురాజ్ పార్టీని స్థాపించి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో చిరాగ్ పొత్తు పెట్టుకోనున్నారని ఊహాగానాలు సాగుతున్న తరుణంలో కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీకి, బీజేపీకి మధ్య బీహార్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది.