G20 | కీలక అంశాలపై దృష్టి సారించండి : జీ20 సదస్సుకు ముందు పేర్ల మార్పు రగడపై చైనా
జీ20 (G20) సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా ఇండియా-భారత్ పేరు వివాదం తెరపైకి రావడం పట్ల చైనా స్పందించింది. పేరు మార్పు కంటే కీలకమైన అంశాలపై భారత్ దృష్టి సారించాలని సూచించింది.
న్యూఢిల్లీ : జీ20 (G20) సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా ఇండియా-భారత్ పేరు వివాదం తెరపైకి రావడం పట్ల చైనా స్పందించింది. పేరు మార్పు కంటే కీలకమైన అంశాలపై భారత్ దృష్టి సారించాలని సూచించింది. జీ20 వేదిక అవకాశాన్ని భారత్ తన అంతర్జాతీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగించుకోవాలని పేర్కొంది.
భారత్ తన ఆర్థిక వ్యవస్థను సమగ్రంగా సంస్కరించగలదా అనేదే ముఖ్యమని, విప్లవాత్మక సంస్కరణలు లేకుండా, భారతదేశం విప్లవాత్మక అభివృద్ధిని సాధించదని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది. జీ20 వేదిక ద్వారా భారత్ ప్రపంచ దేశాల దృష్టిని తన వైపు తిప్పుకునేలా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామని, ఇది దేశ వృద్ధిని ముందుకు నడిపించగలదని వ్యాఖ్యానించింది.
రానున్న జీ20 సదస్సుపై ప్రపంచం దృష్టి కేంద్రీకరించిన క్రమంలో ప్రపంచానికి భారత్ ఏం చెప్పదలుచుకున్నదని చైనా ప్రశ్నించింది. పేరు మార్పు ప్రతిపాదన వలసవాద పేర్లను తొలగించే ప్రక్రియను ప్రతిబింబిస్తోందని చైనా మీడియా వ్యాఖ్యానించింది. జీ20 డిన్నర్‌కు ప్రతినిధులకు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిఉండటంతో మోదీ సర్కార్ దేశం పేరును భారత్‌గా మార్చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ ప్రతిపాదనపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. విపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టడంతోనే కాషాయ సర్కార్ దేశం పేరును భారత్‌గా మార్చాలని యోచిస్తోందని విరుచుకుపడ్డాయి.
Read More :
G20 Summit | జీ20 సమ్మిట్ వేళ.. ఢిల్లీలో బైడెన్, సునాక్, ట్రూడోస్ బస ఎక్కడంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

