న్యూఢిల్లీ: 6జీ నెట్వర్క్ను అభివృద్ధి చేయడంలో చైనా ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ డివైజ్ను విజయవంతంగా పరీక్షించినట్టు తెలిపింది. ఈ పరికరం ద్వారా కాంతి సిగ్నళ్లను ఎలక్ట్రికల్ సిగ్నళ్లుగా మార్చకుండానే ఒక స్థానం నుంచి మరో స్థానానికి పంపించగలిగినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ శాటిలైట్ డివైజ్ను ఈ ఆగస్టులో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.