Beijing | నరవాణేను టార్గెట్ చేస్తూ తన అధికారిక పత్రికలో వ్యాసం రాసుకున్న డ్రాగన్
Beijing | భారత ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే టార్గెట్‌గా చైనా విమర్శలకు దిగింది. భారత్‌లోని అంతర్గత సమస్యల నుంచి ప్రజల

Beijing | భారత ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే టార్గెట్‌గా చైనా విమర్శలకు దిగింది. భారత్‌లోని అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే నరవాణే సంచలన వ్యాఖ్యలకు దిగుతున్నారని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. సీడీఎస్ బిపిన్ రావత్ తర్వాత ఆర్మీ చీఫ్ నరవాణేకు మోదీ సర్కార్ కొన్ని బాధ్యతలు అప్పజెప్పిందని గ్లోబల్ టైమ్స్ తన వ్యాసంలో పేర్కొంది. మొదటి నుంచి కూడా చైనాను సీడీఎస్ రావత్ వ్యతిరేకిస్తూనే వుండేవారని, నరవాణే కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నారని విమర్శించింది.
ఇలా చేయడం ద్వారా తన స్థానాన్ని మరింత పదిలపర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చైనా రాసుకుంది.చైనా, ఇండియా కమాండర్ స్థాయిలో జరిగిన చర్చలకు అనుగుణంగా నరవాణే మసులుకోవడం లేదని రాసుకున్నారు. ఎల్ఏసీ వద్ద ఏకపక్షంగా సరిహద్దు రూపు రేఖలను మార్చడానికి భారత్ ఏమాత్రం అంగీకరించదని, అలాంటి పరిణామాలకు కచ్చితంగా అడ్డుకట్ట వేస్తామని ఆర్మీ చీఫ్ నరవాణే కరాఖండిగా చెప్పేశారు. ఈ కరాఖండిగా చెప్పడం చైనాకు రుచించకపోయి ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన 14 వ రౌండ్ స్థాయి చర్చలకు తగ్గట్టుగా నరవాణే వ్యాఖ్యలు లేవని చైనా విమర్శించింది. నరవాణే నిత్యం తన ఆర్మీతో చైనా వ్యతిరేక వ్యాఖ్యలనే ఉటంకిస్తూ వుంటారని, ఎప్పుడూ చైనాకు వ్యతిరేకంగానే చెబుతూ వుంటారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

