Chimpanzee | న్యూఢిల్లీ, జూలై 27: చింపాంజీలు పరస్పరం మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా అవి మనుషుల మాదిరిగా వ్యవహరిస్తాయని, వేగవంతమైన సంభాషణల స్థానంలో సైగలను చేసుకుంటాయని కొందరు పరిశోధకులు వెల్లడించారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌కు చెందిన గాల్ బదిహీ నేతృత్వంలోని కొందరు శాస్త్రజ్ఞుల బృందం పరిణామం కారణంగా మనుషులు, కోతులు పంచుకునే ప్రవర్తనా విధానాలపై పరిశోధనలు జరిపింది.
252 తూర్పు ఆఫ్రికా చింపాంజీలకు సంబంధించిన 252 వీడియోలను పరిశీలించిన తర్వాత మానవులు మాదిరిగా చింపాంజీలు ఒకదానితో మరొకటి సంభాషించుకుంటాయని నిర్ధారించడమే కాక, అవి 8,500 కన్నా ఎక్కువగా సంజ్ఞలను చేసుకున్నట్టు గుర్తించింది. వీటి డాటాను విస్తృతంగా విశ్లేషించి కమ్యూనికేషన్ సారుప్య నమూనాలను పరిశీలించడమే కాక, వాటి సంస్కృతుల మధ్య కమ్యూనికేషన్లో తేడాలను గుర్తించింది. కరెంట్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన వివరాల ప్రకారం.. మానవులు సంభాషించే విధానం వందల సంవత్సరాల క్రితం మన పరిణామ చరిత్రలో చింపాంజీలతో విడిపోవడానికి ముందు ఉద్భవించి ఉంటుందని పేర్కొంది.