చలిగుప్పిట ఉత్తర భారతం.. భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
Coldwaves | పంజాబ్, హర్యానా, చండీగఢ్, దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశం చలితో వణుకుతున్నది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలితీవ్రత పెరుగుతున్నది. ఢిల్లీలో మంగళవారం ఉష్ణోగ్రతలు మరింత తెగ్గే అవకాశం ఉందని వాతావరణకేంద్రం హెచ్చరించింది. సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7.6
North India | పంజాబ్, హర్యానా, చండీగఢ్, దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశం చలితో వణుకుతున్నది. ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలితీవ్రత పెరుగుతున్నది. ఢిల్లీలో మంగళవారం ఉష్ణోగ్రతలు మరింత తెగ్గే అవకాశం ఉందని వాతావరణకేంద్రం హెచ్చరించింది. సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7.6 డిగ్రీలుగా నమోదైంది. పంజాబ్ భటిండాలో ఉష్ణోగ్రతలు 0.4 డిగ్రీలకు పడిపోయాయి. హర్యానాలోని మాండ్కోలాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.3 డిగ్రీలు, ఫతేహాబాద్లో 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్‌లోనూ చలి కొనసాగుతున్నది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 5కు పడిపోయాయి. మధ్యప్రదేశ్‌లోనూ ఈ నెల 4 వరకు చలి కొనసాగనున్నది.
చాలా ప్రాంతాల్లో పది డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గ్వాలియర్, రేవాలో ఉదయం దట్టమైన పొగమంచుకు పేరుకుపోతున్నది. జమ్మూకశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లోనూ చలి కొనసాగుతున్నది. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్లలో పాదరసం ఐదు డిగ్రీల దిగువకు పడిపోయింది. మంగళవారం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 6 నాటికి ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానాలలో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు ఉదయం పూట దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

