న్యూఢిల్లీ: గుర్తింపు లేని పెళ్లి(Invalid Marriages) చేసుకున్న వారికి పుట్టిన పిల్లలకు.. తల్లితండ్రుల ఆస్తిలో వాటా ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు(Supreme Court) తెలిపింది. అక్రమ పెళ్లి చేసుకున్న జంటకు కలిగే సంతానానికి చట్టపరమైన హక్కులు వర్తిస్తాయని ఇవాళ కోర్టు వెల్లడించింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం .. గుర్తింపు లేని పెళ్లి చేసుకున్న వారికి కలిగే సంతానం కూడా తమ పేరెంట్స్ ప్రాపర్టీని పొందే హక్కు ఉంటుందని కోర్టు చెప్పింది. 2011లో దాఖలైన ఓ పిటీషన్‌పై ఇటీవల సీజేఐ డీవై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసంది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఆస్తుల పంపకంపై 2011లో రెండు జడ్జిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే గుర్తింపులేని పెళ్లి చేసుకున్న వారికి కలిగిన పిల్లలకు ఎటువంటి హక్కులు వర్తించవు అని అప్పట్లో తీర్పు చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ తీర్పును వ్యతిరేకిస్తూ కొత్త తీర్పును వెలువరించింది.