కోల్‌కతా, సెప్టెంబర్ 22: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) డ్యాముల నుండి నీటి విడుదల విషయంలో కేంద్రం తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర జల కమిషన్ ప్రతినిధులు, జల్‌శక్తి శాఖ, కేంద్రం కీలక నిర్ణయాలన్నీ ఏకపక్షంగా తీసుకున్నాయని ప్రధాని మోదీకి రాసిన రెండో లేఖలో సీఎం మమత ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలతో సంబం ధం లేకుండా అనేకమార్లు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని ప్రధానికి తెలిపారు. దీనివల్ల ఇటీవల బెంగాల్లో 5 లక్షల మంది వరద ముంపునకు గురయ్యారని, ముంపు బాధితులను ఆదుకునేందుకు కేంద్రం నిధులు కేటాయించి, వాటిని విడుదల చేయాలని కోరారు.