న్యూఢిల్లీ, నవంబర్ 7: నేషనల్ జ్యుడీషియల్ మ్యూజి యం ఆండ్ అర్కైవ్(ఎన్జేఎంఏ)ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ప్రారంభించారు. గతంలో మాజీ న్యాయమూర్తుల లైబ్రరీ ఉన్న స్థలంలో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మ్యూజియంలో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ న్యాయవాది(ఏఐ లాయర్)తో జస్టిస్ డీవై చంద్రచూడ్ ముచ్చటించారు. ‘భారత్‌లో మరణ శిక్ష రాజ్యాంగబద్ధమేనా?’ అని ఏఐ లాయర్‌ను ప్రశ్నించారు. ‘అవును. భారత్‌లో మరణిశిక్ష రాజ్యాంగబద్ధమే.
హేయమైన, అరుదైన నేరాల్లో కోర్టు ఈ శిక్ష విధించొచ్చు’ అని ఏఐ సమాధానమిచ్చి న్యాయమూర్తులను ఆశ్చర్యపరిచింది. కాగా, గ్రంథాలయాన్ని మ్యూజియంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్జేఎంఏ ప్రారంభోత్సవాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ బహిష్కరించాయి.