chicken blood parenting | తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ కనబర్చడం అవసరమే. అయితే, అది మోతాదుకు మించి ఎక్కువైతేనే ఇబ్బంది. ఇప్పటికే ‘హెలికాఫ్టర్ పేరెంటింగ్’ కాన్సెప్ట్ గురించి వినే ఉంటారు. అయితే చైనాలో తాజాగా ‘ చికెన్ బ్లడ్ పేరెంటింగ్ ‘ అనే కొత్త ట్రెండ్ మొదలైంది.
‘రానున్న తరంలో మా పిల్లలే జగజ్జేతలుగా ఉండాలి. చదువు, ఆటలు, కళలు.. ఇలా అన్ని రంగాల్లో ఆరితేరాలి. శారీరకంగా, మానసికంగానూ ధృడంగా ఉండాలి. ఇంగ్లిష్ సహా ప్రధాన ప్రపంచ భాషల్లో గడగడా మాట్లాడేయాలి. దీని కోసం రోజుకు కనీసం 14 గంటలు శిక్షణనిస్తాం. పాఠశాల దగ్గర్లో ఇల్లు కొంటాం. ఉపాధ్యాయుల ఇంటికే పిల్లలను తీసుకెళ్లి ఎక్స్ట్రా వర్క్ చేయిస్తాం. అవసరమైతే ఆఫీసుకు సెలవుపెట్టి మరీ పిల్లల పక్కన కూర్చొని అన్నీ నేర్పిస్తాం. మొత్తంగా సకల శాస్త్రాల్లో పిల్లలు రాటుదేలాలి’ అనే విధానమే ‘చికెన్ బ్లడ్ పేరెంటింగ్’. ఇప్పటికే చైనాలోని బీజింగ్, షాంఘై, గువాంగ్జౌలో ఈ పద్దతి వచ్చేసింది.
పురాతన కాలంలో రోగాలు సోకిన వారికి చైనాలో అప్పుడే చంపిన కోడి రక్తాన్ని తాగించేవారు. ఇలా చేస్తే, క్యాన్సర్‌తో పాటు వంధ్యత్వం, బట్టతల కూడా పోతుందని నమ్మేవారు. అలాగే, అప్పుడే చంపిన కోడి వెచ్చటి రక్తాన్ని తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఒక నమ్మకం కూడా ఉండేది. ఈ చికిత్సను ‘చికెన్ బ్లడ్ ట్రీట్మెంట్’గా పిలిచేవారు. కాగా.. తమ పిల్లలు మెదడు చురుగ్గా ఉండాలని ఇక్కడి పేరెంట్స్ అనుసరిస్తున్న తాజా ట్రెండ్‌కు కూడా ‘చికెన్ బ్లడ్ పేరెంటింగ్’గా పేరుపెట్టారు.
‘చికెన్ బ్లడ్ పేరెంటింగ్’ పేరుతో పిల్లలను నిర్బంధిస్తూ, పుస్తకాలతో కుస్తీ పట్టించడం వల్ల దేశంలోని 81 శాతం మంది పిల్లలకు కంటి సమస్యలు తలెత్తినట్టు చైనాలోని నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది. టీనేజర్లలో 25 శాతం మంది డిప్రెషన్లోకి, 7.4 శాతం మంది కోలుకోలేని నిరాశలోకి వెళ్లినట్టు వైద్యులు హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Jordar sujatha | ఏ భాష మాట్లాడి అవమానపడ్డదో, ఆ భాషకే బ్రాండ్ అంబాసిడరైంది..
క్వీన్ ఎలిజబెత్ (95) దీర్ఘాయువుకు ఐదు రహస్యాలివే!
అభిమాని కాలిపై అశ్లీల నటి మియా ఖలీఫా టాటూ.. ఏం చేసిందో తెలుసా..?
రెండు దేశాల మధ్య బెడ్.. రొమాంటిక్‌గా హనీమూన్.. ఎక్కడో తెలుసా?