పడిపోతున్నారు..
హైటెక్‌యుగంలో సోషల్‌మీడియా యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ముఖ్యంగా కొందరు అమ్మాయిలు ఈ విషపు వలలో త్వరగా పడిపోయి, తేరుకొనే లోపే వారి జీవితాల్లో అంధకారం అలుముకుంటున్నది. సోషల్ మీడియా చాటింగ్ యాప్‌ల ద్వారా కొందరు కేటుగాళ్లు అమాయక యువతులు, మైనర్లకు చేరువై ట్రాప్‌లోకి దింపి, మాయమాటలతో నమ్మించి, ఆ తర్వాత బ్లాక్ మెయిల్, ఆర్థిక దోపిడీ, లైంగిక వేధింపులతో అందమైన జీవితాలను చీకట్లోకి నెడుతున్నారు.
- దారి తప్పుతున్న డిజిటల్ పరిచయాలు
- స్మార్ట్ ‘ట్రాప్’లో పడి అమ్మాయిల విలవిల
- శారీరక బంధాల్లో ‘బందీ’లుగా బాధితులు
- అందమైన జీవితాలను హరిస్తున్న సోషల్ మీడియా
- ఆందోళన కలిగిస్తున్న మిస్సింగ్ కేసులు
- దర్యాప్తులో వెలుగుచూస్తున్న ఘటనలు
- పిల్లలపై శ్రద్ధ చూపని తల్లిదండ్రులు
సుబేదారి, ఏప్రిల్ 26 : హైటెక్‌యుగంలో సోషల్‌మీడియా యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ముఖ్యంగా కొందరు అమ్మాయిలు ఈ విషపు వలలో త్వరగా పడిపోయి, తేరుకొనే లోపే వారి జీవితాల్లో అంధకారం అలుముకుంటున్నది. సోషల్ మీడియా చాటింగ్ యాప్‌ల ద్వారా కొందరు కేటుగాళ్లు అమాయక యువతులు, మైనర్లకు చేరువై ట్రాప్‌లోకి దింపి, మాయమాటలతో నమ్మించి, ఆ తర్వాత బ్లాక్ మెయిల్, ఆర్థిక దోపిడీ, లైంగిక వేధింపులతో అందమైన జీవితాలను చీకట్లోకి నెడుతున్నారు. డిజిటల్ యుగంలో ప్రేమ ముసుగులో జరుగుతున్న ఈ ఆకృత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సోషల్ మీడియా ప్రభావంతో కొంతమంది అమ్మాయిలు దారి తప్పుతున్నారు. తెలిసీ తెలియని వయసులో స్మార్ట్ ‘ట్రాప్’లో పడి జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకొ ని.. శారీరక బంధాలతో ‘బందీ’ అయి మానసికంగా కుంగిపోతున్నారు. ఉన్నతంగా ఎదగాల్సిన వయసులో లవ్ అట్రాక్షన్‌లో పడి ప్రేమించిన వ్యక్తి వ్యవహారశైలిని తెలుసుకోకుండానే మోసపోతున్నారు. డిజిటల్ జనరేషన్లో స్మార్ట్ ఫోన్ల వినియో గం తప్పనిసరిగా మారింది. ఇది కొంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నది. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళల మిస్సింగ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోజుకు సగటున 10నుంచి 20 ఫిర్యాదులు వస్తున్నాయి.
వీటిలో అ మ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 16 నుంచి 25 ఏళ్లలోపు వాళ్లతోపాటు కొందరు మైనర్లు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. స్మార్ట్ ఫోన్లో వాట్స ప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ద్వా రా అపరిచితులతో పరిచయాలు ఏర్పరుచుకొని, ఉన్నత చదువులకు స్వస్తి చెప్పి, ఏమీ ఆలోచించకుండా నెల, రెండు, మూడు నెలల్లోనే ప్రేమ పేరు తో శారీరక బంధాలకు లొంగిపోయి.. కన్నవాళ్లను కాదని ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ప్రేమించిన వ్యక్తి అస లు రూపం తెలుసుకొని, మోసపోయామని ఇంటి దారిపడుతున్నారు. అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపకపోవడం, స్మార్ట్ ఫోన్ ఎంతమేరకు అవసరం, పిల్లలు ఎవరితో మా ట్లాడుతున్నారు, సోషల్‌మీడియాలో ఎవరితో కనెక్ట్ అవుతున్నారనే విషయంలో దృష్టిపెట్టకపోవడంతో ఇలాం టి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి.
- హనుమకొండ నయీంనగర్‌కు చెందిన 7వ తరగతి చదువుతున్న మైనర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో హనుమకొండకు చెందిన 15 ఏళ్ల బాలుడు పరిచయమయ్యాడు. 3 నెలలుగా ఫోన్‌కాల్స్, చాటింగ్ చేసుకున్నారు. ఈ నెల మొదటి వారంలో బాలిక, బాలుడు సినిమాకు వెళ్లారు. రాత్రి 7 గంటల వరకు బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు హనుమకొండ పీఎస్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు దర్యాప్తు చేయగా, రాత్రి 8 గంటల సమయంలో వారిద్దరూ పబ్లిక్ గార్డెన్లో ఉన్నారు. ఇరువురికి కౌన్సెలింగ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. డ్యూటీ రీత్యా ఇంటికి సాయంత్రం లేట్‌గా రావడంతో అమ్మాయి ప్రవర్తన కనిపెట్టలేకపోయారని పోలీసు విచారణలో తేలింది.
- హనుమకొండకు చెందిన డిగ్రీ చదువుతున్న యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో కర్నూల్‌కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. నెల క్రితం కర్నూల్‌కు పారిపోయి పెళ్లి చేసుకున్నది. యువతి తల్లిదండ్రులు హనుమకొండ పీఎస్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసుల దర్యాప్తులో కర్నూల్లో ఉన్నట్లు తేలింది. తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి నచ్చజెప్పి హనుమకొండకు తీసుకొచ్చారు. రెండు రోజులకే మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది.
- హనుమకొండ భీమారానికి చెందిన బీటెక్ చదువుతున్న అమ్మాయికి రెండు నెలల క్రితం ఫేస్బుక్లో గుర్తు తెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. యువకుడు కొద్ది రోజుల క్రితం వరంగల్ నగరానికి వచ్చాడు. ఇద్దరు లాడ్జిలో శారీరకంగా కలుసుకున్నారు. ఆ యువకుడు తిరిగి వరంగల్ నుంచి వెళ్లిన తర్వాత అతడి ఫేస్బుక్ అకౌంట్‌ను బ్లాక్ చేశాడు. బాధిత యువతి మోసపోయానని తెలుసుకొని మానసికంగా కుమిలిపోయింది. చివరికి భరోసా సెంటర్లో ఫిర్యాదు చేసింది.
- వరంగల్ నగర శివారుకు చెందిన యువతి హనుమకొండలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నది. బంధువుల పెళ్లిలో దగ్గరి బం ధువైన యువకుడు ఆ యువతి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. కొద్ది రోజులు ఫోన్ కాల్స్, వాట్సప్ చాటింగ్, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేయడమే కాకుండా, గోల్డ్, కొంత డబ్బులు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతి గట్టిగా అడగడంతో లేనిపోనివి అంటగట్టి తప్పించుకున్నాడు. బాధిత యువతి మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడికి చెప్పినా వినకపోవడంతో, లైంగికదాడి కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
పిల్లల ప్రవర్తన కనిపెడుతూ ఉండాలి
అమ్మాయిలు, అబ్బాయిలతో తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉండాలి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న అమ్మాయిలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టుకోవాలి. కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నపుడు వారి మానసిక పరిస్థితి, కండిషన్ ఎలా ఉందని గమనించాలి. చెడు స్నేహాలపై దృష్టి పెట్టాలి. అబ్బాయిల విషయంలో కూడా అలాగే ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలి. ఓపెన్‌గా మాట్లాడాలి. వారి ఇష్టాలను తెలుసుకోవాలి. ఎవరినైనా ఇష్టపడుతున్నట్లు తెలిస్తే, భవిష్యత్ రీత్యా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ట్రాప్‌లో పడి, పొరపాట్లు జరిగి, బ్లాక్ మెయిల్‌కు గురైనా, లేదా తప్పు జరిగినపుడు వెంటనే మానసిక ధైర్యం చెప్పి, భవిష్యత్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయాలి. బాధలో ఉన్నప్పుడు కుంగిపోయేలా ఇబ్బంది పెట్టొద్దు. టెక్నాలజీ జనరేషన్లో ఎలాంటి తప్పులు, నేరం చేసినా చట్టరీత్యా శిక్షించబడి, భవిష్యత్ పాడవుతుందని అబ్బాయిలకు హెచ్చరికగా చెప్పాలి.
– దార కవిత, సెంట్రల్ జోన్ డీసీపీ (వరంగల్ పోలీసు కమిషనరేట్)
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

