రాయ్‌పూర్: చత్తీస్ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ భగల్ ఇంట్లో ఇవాళ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వమించారు. భూపేశ్ భగల్ కుమారుడు చైతన్య భగల్‌తో లింకున్న లిక్కర్ స్కామ్‌లో ఆ సోదాలు జరిగాయి. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మును చైతన్య భగేల్ మనీ ల్యాండరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దుర్గ్ జిల్లాలోని బిలాయి పట్టణంలో ఉన్న భగేల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు. భూపేశ్, చైతన్య భగల్ ఇద్దరూ ఒకే చోట ఉంటున్నారు. అయితే లిక్కర్ స్కామ్‌తో లింకున్న చైతన్య భగల్ కోసం మాత్రమే ఆ ఇంటికి వెళ్లినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ ఉదయం భారీ స్థాయిలో మాజీ సీఎం ఇంటి ముందు పోలీసులు ఉన్నారు. మార్చి 10వ తేదీన కూడా చైతన్య భగల్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఈడీ తనిఖీలను వ్యతిరేకిస్తూ భూపేశ్ భగల్ తన ట్విట్టర్లో ఇవాళ ఓ పోస్టు పెట్టారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు అని, రాయ్‌ఘడ్ జిల్లాలోని తామ్నార్ తహిసిల్‌లో అదానీ గ్రూపు బొగ్గు గని కోసం చెట్లను నరికివేస్తున్నారని, ఆ అంశాన్ని ప్రస్తావిస్తామన్న నెపంతో ఈడీని తన ఇంటికి పంపినట్లు తన ట్వీట్లో భూపేశ్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ వల్ల రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడిందని, లిక్కర్ సిండికేట్ నడిపిన వారికి సుమారు 2100 కోట్ల లాభం ముట్టినట్లు ఆరోపలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఈడీ పలువుర్ని అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో మాజీ మంత్రి కవాసి లక్మాతో పాటు కొందరు నేతలు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. 2019 నుంచి 2022 మధ్య మద్యం కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. ఆ సమయంలో భగేల్ ప్రభుత్వం ఉన్నది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సుమారు 205 ఆస్తులను ఈడీ అటాక్ చేసింది.
ED आ गई.
आज विधानसभा सत्र का अंतिम दिन है.
अडानी के लिए तमनार में काटे जा रहे पेड़ों का मुद्दा आज उठना था.
भिलाई निवास में “साहेब” ने ED भेज दी है.
(कार्यालय- भूपेश बघेल)
— Bhupesh Baghel (@bhupeshbaghel) July 18, 2025