కొత్తగూడెం ప్రగతి మైదాన్: భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో శనివారం జరిగింది. బస్తర్ రేంజ్ ఐజీ పాటిలింగం తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
ఈ క్రమంలో కొలనార్ అడవిలో మావోయిస్టులు తారసపడి వారిపైకి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య గంటపాటు భీకర పోరు జరిగింది. కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ముగ్గురు మావోయిస్టుల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు.