రాయపూర్ : చత్తీస్ఘఢ్లో రూ. 2000 కోట్ల స్కామ్ బయటపడిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించడం నిరాధారమైనదని, ఖండనార్హమని సీఎం భూపేష్ బాఘేల్ (Bhupesh Baghel) స్పష్టం చేశారు. బీజేపీకి ఈడీ రాజకీయ ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల్లో విపక్షానికి అస్త్రాన్ని అందించడమే ఈడీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
చత్తీస్‌ఘడ్‌లో ఎన్నికలు దగ్గరపడటంతో బీజేపీలో నిరాశ పెరిగిపోతోందని, కేంద్ర దర్యాప్తు ఏజెన్సీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఈడీ, ఐటీ ఇక్కడే మకాం వేస్తాయని తానిప్పటికే చెప్పానని బాఘేల్ గుర్తుచేశారు. దర్యాప్తు ఏజెన్సీలు కొత్త కుట్రలకు తెరలేపుతాయని అన్నారు. కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో మద్యం విక్రయించాలని గతంలో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
2017-18లో మద్యం ఆదాయం రూ. 3900 కోట్లు ఉంటే తమ హయాంలో అది రూ. 6000 కోట్లకు పెరిగిందని అన్నారు. మద్యం విక్రయ విధానంలో తాము ఎలాంటి మార్పులూ ప్రవేశపెట్టలేదని తెలిపారు. మద్యం విక్రయాల నుంచి రాబడి పడిపోయిందని ఈడీ చెబుతున్న విషయం అవాస్తమని రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం పెరుగుదల స్పష్టం చేస్తోందని సీఎం పేర్కొన్నారు. ఏటా ఆడిట్ నిర్వహించే కాగ్ సైతం తన నివేదికలో ఎక్సైజ్ శాఖకు క్లీన్చిట్ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.
Read More
Lithium Reserves: రాజస్థాన్‌లో లిథియం నిక్షేపాలు గుర్తింపు